క్రాష్‌ గార్డ్స్‌ను నిషేధిస్తే?!

20 Dec, 2017 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రమాదాల తీవ్రతను తగ్గించుకునేందుకు కార్ల యజమానులు ప్రత్యేకంగా క్రాష్‌ గార్డులను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ కార్‌ క్రాష్‌ గార్డులపై కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపిస్తోంది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి ఏర్పాటు చేసుకునే ఈ క్రాష్‌ గార్డులను నిషేధించే యోచనల రవాణ మంత్రిత్వ శాఖ ఉంది. క్రాష్‌ గార్డులనేవి.. పాదచారులకు, ద్విచక్ర వాహన దారులకు ప్రమాదమేనని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌ సమయంలో కంపెనీ ఇచ్చిన వాటికి అదనగా ఏ మాత్రం మార్పులు  చేర్పులు చేయరాదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. సాధారణంగా వాహనదారులు కొత్త వాహనం కొత్త తరువాత ప్రమాద తీవ్రతను తగ్గించుకునే నేపథ్యంలో క్రాష్‌ గార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ప్రతి ప్రభుత్వ వాహనానికి కూడా క్రాష్‌ గార్డులు ఉండడం గనార్హం.

  అయితే ఈ క్రాష్‌ గార్డుల వల్లే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముదని రవాణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. క్రాష్‌ గార్డులు ఉండడం వల్ల ప్రమాద సమయంలో కంపెనీ ఏర్పాటు చేసిన ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం​ వల్లనే క్రాష్‌ గార్డులను నిషేధించాలన్న ఆలోచనకి రవాణ మంత్రిత్వ శాఖ వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు