ఈశాన్య భారత్‌లో భూ ప్రకంపనలు

24 Apr, 2019 09:59 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈశాన్య భారత్‌లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోంలో కొద్ది సమయంపాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూ ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇంట్లోనుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇటా నగర్‌కు 180కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. నేపాల్‌లోని కాట్మాండులో సైతం భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.

మరిన్ని వార్తలు