సుప్రీంలో పోలవరంపై విచారణ

3 Jan, 2019 15:55 IST|Sakshi
సుప్రీంకోర్టు

ఢిల్లీ: సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ని పదే పదే నిలుపుదల చేశారని ఒడిశా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. సరైన సమాధానం కోసం రెండు ప్రభుత్వాలకు మూడు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు