పీపీపీ.. డుండుండుం..

27 Nov, 2015 03:49 IST|Sakshi
పీపీపీ.. డుండుండుం..

ఉత్తరాఖండ్‌లోని మోహన్‌పూర్ గ్రామం..
అక్కడ జోగేంద్ర, పూజల పెళ్లి జరుగుతోంది..
పెళ్లింట బంధుమిత్రుల హడావుడి..
బ్యాండు బాజాల మోత.. ఊరంతా ఒకటే పెళ్లిసందడి..

 
అయితే.. మొత్తంగా ఈ వివాహంలో ఓ విశేషముంది.
ఇక్కడ ఎప్పుడో చచ్చిపోయినోళ్లకు పెళ్లి జరుగుతోంది..
అవును.. జోగేంద్ర, పూజలు చిన్నప్పుడే చచ్చిపోయారు..
పెళ్లి జరుగుతోంది వారి బొమ్మలకు!
 
ఉత్తరాఖండ్‌లోని నెతబడీ గిరిజన తెగ.. ఈ తెగలోని వారు చిన్నప్పుడే తమ పిల్లలు కనుక చనిపోతే.. వారి 18వ జయంతి రాగానే.. ఇలా నిజంగానే వివాహం జరిపిస్తారు. ఇదేదో బొమ్మల పెళ్లి తరహాలో ఉండదు. నిజంగానే.. వధువు(చనిపోయిన) తల్లిదండ్రులు.. వరుడి(చనిపోయిన) తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సంబంధం మాట్లాడి.. వివాహం తేదీ ఖరారు చేసుకుంటారు. పెళ్లి అయితే.. నిజమైన వివాహం తరహాలోనే భారీ ఎత్తున జరిపిస్తారు.

వీధుల్లో వరుడి ఊరేగింపు.. విందుభోజనాలు.. కట్నాలు చదివించడం ఇలా అన్నీ ఉంటాయి. వధువు, వరుల తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండదు. తమ తెగలో ఈ సంప్రదాయం పూర్వీకుల నుంచీ వస్తోందని.. ఇలా వివాహం చేస్తే.. వారి ఆత్మలు శాంతిస్తాయని గ్రామానికి చెందిన పీతాంబర్ చెప్పారు. అలా చేయని పక్షంలో రెండు కుటుంబాలు కష్టాలపాలవుతాయని వారు నమ్ముతారు.

మరిన్ని వార్తలు