మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

13 Aug, 2019 10:14 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

భోపాల్‌: పోలీసుల కస్టడీలో ఉన్న గిరిజన నిందితుల చేత మూత్రం తాగించిన స్టేషన్‌ సిబ్బంది తీవ్ర అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని నన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నన్‌పూర్‌కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను ఓ నేరం కింద అరెస్ట్‌చేసిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. కస్టడీలో ఉన్న వారిపై ఖాకీలు లాఠీ ఝుళిపించి.. చితకబాదారు. తీవ్ర గాయలపాలైన యువకులు తాగడానికి మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. అయినా కనుకరించని స్టేషన్‌​ సిబ్బంది వారి చేత మూత్రం తాగించి తీవ్ర అవమానానికి గురిచేశారు.

ఘటనపై స్పందించిన స్థానిక ఎస్పీ విపుల్‌ శ్రీవాస్తవ.. ఈ చర్యకు పాల్పడ్డ నలుగురు స్టేషన్‌ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. దీనిపై మరింత విచారణ జరిపి చట్టపరమమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. గాయపడ్డ ఐదుగురు గిరిజన యువకులకు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు