ప్రసారాలు నిలిపివేతపై రాష్ట్రపతికి ఫిర్యాదు

19 Feb, 2014 13:30 IST|Sakshi
ప్రసారాలు నిలిపివేతపై రాష్ట్రపతికి ఫిర్యాదు

న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రసారాలు నిలిపివేసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింప చేయడం అప్రజాస్వామికమని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమైన బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చ సజావుగా జరిగేలా చూడాల్సిన అవసరముందన్నారు. కేవలం సుష్మాస్వరాజ్‌, జైపాల్‌రెడ్డి మాత్రమే చర్చలో పాల్గొని బిల్‌ పాస్‌ చేశారన్నారు.

కాగా వివాదాస్పద తెలంగాణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించటానికి సంబంధించిన కీలకమైన 90 నిమిషాల సభా కార్యక్రమాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. లోక్‌సభ టీవీకి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవటంతో ఏ చానల్‌లోనూ సభా కార్యక్రమాలు ప్రసారం కాలేదు.

మరిన్ని వార్తలు