'ఎవరో చేసిన పొరపాట్లకు వారికెందుకు శిక్ష?'

25 Oct, 2016 16:30 IST|Sakshi
'ఎవరో చేసిన పొరపాట్లకు వారికెందుకు శిక్ష?'

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విధానం రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన స్వరాన్ని గట్టిగా వినిపించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగానికి విరుద్ధమైనదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దానికి తప్పక స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా ముస్లిం మహిళలకు విడాకులిచ్చినట్లుగా భావించే విధానాన్ని రద్దు చేయాలని, అది లింగ వివక్ష కిందికే వస్తుందని, రాజ్యాంగ నిబంధనలకు ఆ విధానం పూర్తిగా విరుద్ధమైనదని అన్నారు.

'లింగ వివక్షకు తప్పకుండా స్వస్తి పలకాలి. మనది పౌరులతో నిండిన సమాజం. మనది ప్రజాస్వామ్య దేశం. ఎందుకు లింగ వివక్ష ఉండాలి? ట్రిపుల్ తలాక్ అనేది లింగ వివక్షే. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైనది. ఎవరో చేసిన పొరపాట్లకు నిస్సహాయ ఆడపడుచులు ఎందుకు శిక్షకు గురవ్వాలి. అందుకే, బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ విధానం రద్దుకు గట్టి మద్దతుగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్రిపుల్ తలాక్ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించిన తర్వాత మరో బీజేపీ అగ్రనేత ఆ వ్యాఖ్యలు సమర్థిస్తూ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు