జంట హత్యల కేసులో మాజీ మంత్రికి జైలు శిక్ష

11 Nov, 2013 20:54 IST|Sakshi

అగర్తల(ఐఎఎన్ఎస్):  జంట హత్యల కేసులో ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించిన నేరంపై  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి విరాజిత్ సిన్హాకు త్రిపుర కోర్టు ఒకటి మూడు నెలల జైలు శిక్ష విధించింది.  2004 జూలై 20 జరిగిన ఓ గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా ఉత్తర త్రిపుర బాబుబజార్ ప్రాంతం వద్ద  పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘటన  సీపీఎం, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఓ సీపీఎం కార్యకర్త, సిన్హా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు నిఖిల్ దేవ్ మరణించారు. ఆ రోజు సిన్హా వద్ద లెసైన్స్‌డ్ పిస్టల్ ఉంది.


‘ఉండాల్సిన తూటాల కంటే సిన్హా వద్ద అదనంగా తూటాలు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆయన పిస్టల్ నుంచి తిరుగు కాల్పులు కూడా జరిగాయి..’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ దేవ్ విలేకరులకు వివరించారు. ఇదే కేసులో సిన్హాకు రెండున్నర నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉనోకోటి జిల్లా, సెషన్స్ జడ్జి గౌతమ్ దేవ్‌నాధ్ సోమవారం తీర్పు చెప్పినట్లు ఆయన తెలిపారు.

కాగా ఆ రోజు మరణించిన సీపీఎం కార్యకర్త తండ్రి అబ్దుల్ రహమాన్‌కు అల్లరిమూకను రెచ్చగొట్టిన నేరంపై కోర్టు మూడు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. సిన్హా 1988 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏఐసీసీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.

మరిన్ని వార్తలు