ఫేస్‌బుక్‌ను మించిపోయిన ట్రూకాలర్‌!

2 Jun, 2017 12:31 IST|Sakshi
ఫేస్‌బుక్‌ను మించిపోయిన ట్రూకాలర్‌!

న్యూఢిల్లీ: మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందటే.. యూజర్లు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం పెరిగిపోతోంది. ఈ కమ్యూనికేషన్‌ యాప్‌కు ఇటీవల భారత్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. ఎంతలా అంటే.. గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు పొందిన యాప్‌ల జాబితాలో ఫేస్‌బుక్‌ను అదిగమించి ట్రూకాలర్‌ దూసుకెళ్తోంది.

మేరీ మీకర్‌ ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌ 2017 వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు పొందిన యాప్‌ల జాబితాలో ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టి ట్రూకాలర్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో వాట్సప్‌ మొదటిస్థానంలో ఉండగా.. మెసెంజర్‌, షేరిట్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే.. యాప్‌లో ప్రకటనదారులకు రోజుకు లక్ష క్లిక్‌లను ట్రూకాలర్‌ అందిస్తుందని మేరీ మీకర్‌ ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు