సీక్రెట్ ఓటింగ్ జరిగి ఉంటే..!

18 Feb, 2017 16:54 IST|Sakshi
సీక్రెట్ ఓటింగ్ జరిగి ఉంటే..!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష ఓటింగ్ తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి 122 ఓట్లతో నెగ్గిన విషయం తెలిసిందే. సభలో సీక్రెట్ ఓటింగ్ జరిపి ఉంటే కచ్చితంగా మేమే గెలిచేవాళ్లమని పన్నీర్ సెల్వం వర్గీయుడు కె.పాండ్యరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విశ్వాసపరీక్షను వ్యతిరేకిస్తూ పన్నీర్ వర్గీయులు కొందరు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో ఆరుగురు పన్నీర్ మద్ధతుదారులు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు.

స్పీకర్ ధన్ పాల్ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించక పోవడం వల్లనే పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గారని పన్నీర్ మద్ధతుదారులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకే తిరుగుబాబు ఎమ్మెల్యేలు నటరాజ్, సెమ్మలై, ఆరుకుట్టి, మనోహర్, మాణిక్యం, శరవణన్ విశ్వాసపరీక్షలో పళనికి వ్యతిరేకంగా ఓటేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు విపక్షం లేకుండానే ఓటింగ్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేతలు, కాంగ్రెస్ నేతలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 133 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా పళనిస్వామికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు, 9 మంది సభను వాకౌట్ చేశారు.

తమిళనాడు రాజకీయాలపై కథనాలు

శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!

విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి

స్పీకర్ కు లిటిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా?

నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్

 

మరిన్ని వార్తలు