ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తారు!

18 Feb, 2016 10:42 IST|Sakshi

మహిళా జర్నలిస్టుకు ట్విట్టర్‌లో హెచ్చరిక


ముంబై: ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ట్విట్టర్‌లో హెచ్చరించాడో దుండగుడు. ఈ బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు.

అమరేంద్రకుమార్ సింగ్ అనే ట్విట్టర్‌ ఖాతాదారుడు ఈ మేరకు హెచ్చరిక చేశాడు. జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీ పటియాల కోర్టులో పాత్రికేయులపై జరిగిన దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెను ఉద్దేశించి అమరేంద్రకుమార్ తీవ్రస్థాయి బెదిరింపులకు దిగాడు. 'ఒకట్రెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్‌ రేప్ జరుగుతుంది. స్పృహలోకి రండి. భారత మాతతో చెలగాటమాడకండి' అంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై ఆ పాత్రికేయురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354 (ఏ) 1 (అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడటం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు