ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

18 Mar, 2016 20:34 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఇద్దరు కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బడెగుర్రా అటవీ ప్రాంతంలోని కువకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నక్సల్స్ అమర్చిన బాంబుపై కోబ్రా (కమాండ్ బెటాలియన్ ఫర్ రెసొల్యూట్ యాక్షన్) జవాను కాలువేయడంతో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించిందని దంతేవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.



సీఆర్పీఎఫ్ స్క్వాడ్ బృందం, కోబ్రా, జిల్లా పోలీసు బలగాలు కలిసి కువకొండ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. బడెగుర్రా ప్రాంతానికి చేరుకోగానే ఒక జవాను పేలుడు పదార్థంపై కాలు వేయడంతో వెంటనే పేలుడు జరిగిందని ఎస్పీ తెలిపారు. గాయపడిన జవాను కోబ్రా 206వ బెటాలియన్‌కు చెందిన వాడన్నారు. చిప్కల్ అటవీ ప్రాంతంలోని కటెకల్యాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో.. సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడని ఎస్పీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు