ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఏనుగులు!

5 Apr, 2020 12:08 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పాడి ప్రాంతంలో రెండు గున్న ఏనుగులు ప్రమాదవశాత్తూ నీటి కుంటలో కూరుకుపోయాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. వాటిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కుంట లోతుగా ఉండటం, చుట్టూ గుట్టలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మూడు గంటలపాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ఏనుగులను రక్షించారు. జేసీబీతో చుట్టూ ఉన్న మట్టిని కుంటలోకి నెట్టడంతో ఏనుగులు బయటకు రాగలిగాయి. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన గజరాజులు అడవిలోకి పరుగులు పెట్టాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు