కరోనా: బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయం మూసివేత

4 May, 2020 14:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను బీఎస్‌ఎఫ్‌ అధికారులు సోమవారం సీల్‌ చేశారు. బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రావటంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనం లోధి రహదారిలోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉంది. ఇక బీఎస్‌ఎఫ్‌ కార్యాలయ భవనానికి శానిటైజేషన్‌ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన సిబ్బందితో కాంటాక్టు అయిన వారిని ట్రేస్‌ చేస్తున్నామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు. (అస్సాంలో వెలుగుచూసిన స్పానిష్ ఫ్లూ)

ఇక 126 బెటాలియన్‌కి చెందని 25 మంది బీఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 56 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో త్రిపుర రాష్ట్రానికి  చెందన వారు 14 మంది, ఢిల్లీకి చెందిన వారు 43 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మే 3న ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ రావటంతో సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయాన్నిమూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటివకు సీఆర్‌పీఎఫ్‌లో 137 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఒకరు మృతి చెందారు. మరో వైపు సీఐఎస్‌ఎఫ్‌లో కూడా తొమ్మిది కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.      

మరిన్ని వార్తలు