కాల్పుల్లో ఇద్దరు మృతి, ఉద్రిక్తత

10 Sep, 2016 19:23 IST|Sakshi
కాల్పుల్లో ఇద్దరు మృతి, ఉద్రిక్తత

శ్రీనగర్: కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో శనివారం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. షోపియాన్‌లోని టుక్రూ గ్రామంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అనంతనాగ్‌లోని బొటెంగూలో మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

మృతులను అహ్మద్ షేక్(25), యావర్ అహ్మద్(23)లుగా గుర్తించారు. జనం గుంపులుగా ఉండొద్దంటూ హెచ్చరిస్తున్న భద్రతా సిబ్బందిపైకి వందల సంఖ్యలో ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు వెల్లడించారు.  ఆందోళనకారులను అదుపుచేయడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించాయి. ఈ ఘటనల్లో గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోయలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమౌతున్నాయి. బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు 64 రోజులుగా కొనసాగుతున్నాయి. ఘర్షణల్లో 78 మంది మృతి చెందగా.. వేల మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు