‘వీరి నిస్వార్థ సేవలకు వందనం’

25 Apr, 2020 18:40 IST|Sakshi

ఇటానగర్: లాక్‌డౌన్‌లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా వారిని కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షిం‍చేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. తమ విధులు నిర్వర్తించే క్రమంలో అలసిపోయి నేలపై సేదతీరుతున్న పోలీసుల ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను అరుణాచల​ ప్రదేశ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు మాధుర్‌ వర్మ శుక్రవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇద్దరూ పోలీసు అధికారులు వారి హెల్మెట్లలను, లాఠిలను తలగడగా చేసుకుని వాటిపై నిద్రిస్తున్న ఫొటోకి.. ‘అసౌకర్యవంతమైన మంచంపై ఎనిమిది గంటల నిద్ర అంత విలాసవంతమైనదేనా? అవును విలాసవంతమైనదే.. అది మీరు పోలీసు అయితే! ఈ కరోనా వీరులను చూస్తుంటే గర్వంగా ఉంది’  అంటూ ట్వీట్‌ చేశారు. (ఆ బ్రదర్స్‌కు సెల్యూట్‌! పేదల ఆకలి తీర్చటానికి..)

ఇక ఈ పోస్టుకు ఇప్పటి వరకూ 51 వేల లైక్‌లు, 9 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. కరోనా వైరస్‌ మహమ్మారితో యుద్దంలో సైనికులుగా పోరాడుతున్న పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపింస్తున్నారు. వీరి నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘‘నిజమైన యోధులకు పెద్ద వందనం’’ ‘‘వారిని ఎల్లప్పుడు గౌరవిస్తూ.. లాక్‌డౌన్లో మద్దతుగా నిలబడదాం’’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనాను అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు ఉల్లంఘించకుండా కరోనా బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ఎండను సైతం లెక్కచేయకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 24,000 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 700 లకు పైగా మరణించారు. (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం)

>
మరిన్ని వార్తలు