క‌రోనా టైంలోనూ కాసుల కక్కుర్తి

10 Jun, 2020 14:35 IST|Sakshi

అహ్మ‌దాబాద్ : క‌రోనాతో ఓ వైపు ప్ర‌జ‌లు అల్లాడుతుంటే, ఇదే అద‌నుగా భావించి కొన్ని ప్రైవేటు సంస్థ‌లు మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకునే ప‌నిలో ప‌డ్డాయి.  నిబంధ‌న‌ల్ని గాలికొదిలేసి ప్ర‌జ‌ల నుంచి భారీగా సొమ్మ వ‌సూలు చేసిన రెండు ప్రైవేటు సంస్థ‌ల‌పై  ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపించింది. క‌రోనా క‌ట్ట‌డికి  ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క‌రోనా రోగుల‌తో బెడ్‌లు నిండిపోయాయి. (క్వారంటైన్‌ సెంటరా? క్రికెట్‌ స్టేడియమా? )

ఈ నేప‌థ్యంలో వారికి 40 శాతం బెడ్‌లు కేటాయిస్తూ ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స అందించాల్సిందిగా  ప్ర‌భుత్వం సూచించింది. అయితే గుజ‌రాత్‌లోని ఆర్ద‌మ్ హాస్పిట‌ల్‌తో పాటు బాడీలైన్ హాస్పిటల్‌లో క‌రోనా రోగుల నుంచి భారీగా డ‌బ్బు గుంజుతున్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో రెండు ఆస్ప‌త్రుల‌పై 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున జ‌రిమానా విధించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఏడు రోజుల్లోనే ఈ మొత్తాన్ని జ‌మ చేయాల్సిందిగా ఆదేశించారు. లేని ప‌క్షంలో హాస్పిట‌ల్ రిజిస్ర్టేష‌న్ ర‌ద్దు చేస్తామ‌ని తెలిపింది. (ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్‌ )


 

>
మరిన్ని వార్తలు