ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఇది అద్భుతం!

12 Mar, 2020 15:58 IST|Sakshi

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం. రెండు ఆరడుగుల పాములు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బెంగళూరుకు చెందిన వసుధ శర్మ అనే మహిళా బుధవారం తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. 36 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానితో ఒకటి ముడివేసుకుంటూ పైకి లేస్తూ.. డ్యాన్స్‌ చేస్తున్నాయి. ఇక ఈ వీడియోకు ఆమె ‘గోల్ఫ్‌ కోర్స్‌ స్టేడియం కాస్తా పాముల నృత్య ప్రదర్శనగా మారింది’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే గ్రౌండ్‌లో పెరిగిన చెట్ట పోదల్లో రెండు పాములు డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోకు.. ‘ప్రకృతి అందంలో భాగం’ అనే క్యాప్షన్‌ను జత చేసి ఆటవీ అధికారులను ట్యాగ్‌ చేశారు.

కాగా.. ఇప్పటీ వరకూ ఈ వీడియోకు 6వేలకుపైగా వ్యూస్‌ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఓ మై గాడ్‌.. అద్భుతమైన దృశ్యం’, ‘ఇది ప్రకృతి అందమని మీరే అన్నారు.. మరి కాస్తా వాటికి ప్రైవసీ ఇవ్వండి’ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ట్యాగ్‌ చేసిన ఆటవీ అధికారుల్లో ఓకరైన సుశాంత్‌ నందా ‘అవి నాగుపాములు కాదు.. ర్యాట్‌ స్నేక్స్‌’ అని వెల్లడించారు. అదే విధంగా ర్యాట్‌ స్నేక్స్‌ విషరహితమైనవి. కాటు వేయవు కానీ.. గట్టిగా చూట్టేసి ఒత్తిడితో చంపుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు