ఢిల్లీలో ఇద్ద‌రు డాక్ట‌ర‌కు క‌రోనా పాజిటివ్

1 Apr, 2020 17:09 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: క‌రోనా వైర‌స్‌కు కులం, మ‌తం, చిన్నా, పెద్దా అన్న తార‌త‌మ్యం లేదు. ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్‌.. తాజాగా ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌కు సోకింది. ఢిల్లీలోని స‌ఫ్త‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్నఇద్ద‌రు వైద్యులు కోవిడ్ భారిన ప‌డిన‌ట్లు బుధ‌వారం అధికారులు తెలిపారు. వారిలో ఒక‌రు ఇదే హాస్పిట‌ల్‌లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తుండ‌గా, మ‌రొక‌రు బ‌యోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని. ఈమె కొన్నివారాల క్రిత‌మే విదేశాల‌కు వెళ్లివ‌చ్చిన‌ట్లు అధికారులు చెప్పారు.

ఈ ఇద్ద‌రిలోనూ కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిని ఇప్ప‌డు స‌ఫ్త‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌లోని  ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు.క‌రోనా సోకిన ఈ ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌తో స‌న్నిహితంగా ఉన్న మిగ‌తా మిగ‌తా వైద్య సిబ్బందిని కూడా ప‌రీక్షించ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. దేశంలో ఇప్పటివరకు 1,637 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, వారిలో  38 మంది మరణించారని బుధ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. (వారి వివరాలు సేకరించండి: కేంద్రం)


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు