‘నేను ఇక పోలీసుగా ఉండలేను’

24 Aug, 2016 10:49 IST|Sakshi
‘నేను ఇక పోలీసుగా ఉండలేను’

శ్రీనగర్: ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో అల్లరిమూకలు తమ ఇంటిపై దాడి చేయడంతో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాము ఉద్యోగాలు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లో అశాంతి కారణంగా పోలీసు అధికారులు రాజీనామా చేయడం ఇదే మొదటిసారి.

'నా ఇంటిపై దాడి చేయడంతో నేను రాజీనామా చేస్తున్నా. నేనిక పోలీసుగా ఉండలేను. కుటుంబమంతా నాపై ఆధారపడివుంది. ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఇక పోలీసులతో ఉండడని ఇక్కడి ప్రజలకు నేను చెప్పాదలుచుకున్నా’నని ఎస్పీవో వసీమ్ అహ్మద్ షేక్ పేర్కొన్నాడు. వీరి రాజీనామాలపై పోలీసులు మౌనం దాల్చారు.

హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లో తలెత్తిన అలర్లలో 68 మంది మృతి చెందారు. 5 వేల మందిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అల్లరిమూకల రాళ్లదాడిలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.

>
మరిన్ని వార్తలు