అపర కాళిలా మారిన ఆడపులి

7 Jul, 2018 03:33 IST|Sakshi

సరిహద్దుల గొడవలు దేశాలకు, మనుషులకే కాదు.. మృగాలకూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన గొడవ కూడా అలాంటిదే. సాధారణంగా పులులు, సింహాల్లో మగవి ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఇక్కడ ఓ మగ పులి కూడా అలాగే ప్రయత్నించింది. ఓ ఆడపులి అధీనంలోని ప్రాంతంలోకి ప్రవేశించింది.. అయితే, ఆ ఆడపులి అబల కాదు.. అపర కాళి.. చూశారుగా.. కుంగ్‌ఫూ పాండాలాగ అంతెత్తున ఎలా లేచిందో.. ఫైటింగ్‌ పోజు ఎలా పెట్టిందో.. కొంతసేపు రెండూ అరివీర భయంకరంగా కొట్టేసుకున్నాయి. చేసేది లేక ఆ మగ పులి వెనక్కి తగ్గింది. ఈ చిత్రాలను కేమ్‌చంద్‌ జోషి అనే ఫొటోగ్రాఫర్‌ రాజస్థాన్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్కులో తీశారు. ఇలాంటి ఫొటోలు తీసే చాన్స్‌.. జీవితంలో ఒక్కసారే లభిస్తుందని.. తనకా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని జోషి చెప్పారు. 


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా