చికిత్స అంద‌క రెండేళ్ల క్యాన్స‌ర్ చిన్నారి మృతి

13 May, 2020 13:51 IST|Sakshi

 కోల్‌క‌తా : లాక్‌డౌన్ కార‌ణంగా చికిత్స అంద‌క రెండేళ్ల క్యాన్స‌ర్ చిన్నారి క‌న్నుమూసింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. కీమోథెర‌పీ కోసం ఆసుప‌త్రుల చూట్టూ తిర‌గాల్సి వ‌చ్చింద‌ని, స‌రైన స‌మ‌యంలో చికిత్స అంద‌క త‌న కూతురు  చ‌నిపోయిన‌ట్లు తండ్రి  బిస్వ‌జిత్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త ఏడాది క్యాన్స‌ర్ కార‌ణంగా ప్రియాంషి సాహా అనే రెండేళ్ల చిన్న‌రికి క‌ల‌క‌త్తాలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో శ‌స్ర్త‌చికిత్స చేయించారు. ఆ త‌ర్వాత నుంచి రెగ్యుల‌ర్‌గా కీమో ధెర‌పీ చేయించాల‌ని వైద్యులు సూచించారు.

అయితే ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో కీమో థెర‌పీ చేయ‌లేమంటూ హాస్పిట‌ల్ నిర్వాహ‌కులు చెప్ప‌డంతో గ‌త నెల నుంచి స‌రిగ్గా వైద్యం అంద‌క  ఆరోగ్యం క్షీణించిన‌ట్లు ఆమె త‌ల్లిదండ్రులు పేర్కొన్నారు. కోల్‌క‌తాలోని బ‌రాస‌త్ జిల్లా హాస్పిట‌ల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ప‌లు ఆసుప‌త్ర‌ల చుట్టూ తిరిగినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని ప్రియాంషి తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై స్పందించిన మ‌మ‌తా బెన‌ర్జీ.. తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారిని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని, అత్య‌వ‌స‌రంగా చికిత్స అవ‌స‌రం ఉన్న వారి ప‌ట్ల వెంట‌నే స్పందించాల‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆదేశించారు. గ‌త ప‌దేళ్ల‌లో బెంగాల్‌లో వైద్య సదుపాయాలు మెరుగుప‌డ్డాయ‌ని, ఈ పేరును అప్ర‌తిష్ట చేయ‌వ‌ద్ద‌ని కోరారు. ( ‘వీడియో కాన్ఫరెన్స్‌లతో మాకు ఒరిగిందేమీ లేదు’ )

మరిన్ని వార్తలు