బాలకార్మికులను పెట్టుకుంటే రెండేళ్ల జైలు

27 Jul, 2016 02:36 IST|Sakshi
బాలకార్మికులను పెట్టుకుంటే రెండేళ్ల జైలు

న్యూఢిల్లీ : ఎలాంటి వృత్తిలోనైనా 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలను పనిలో పెట్టుకుంటే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘బాల కార్మికుల(నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించగా, మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. గతంలో ఆరు నెలలున్న జైలు శిక్షను రెండేళ్లకు పెంచారు. రూ.10 వేలు-20 వేలుగా జరిమానాను రూ.20 వేలు- 50 వేలకు పెంచారు.

మరిన్ని వార్తలు