మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు

4 Apr, 2019 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం అందించే  ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ను  మోదీకి ప్రకటించింది. భారత్‌- యూఏఈ దేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపరచినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. 

అబుదాబీ యువరాజు, యూఏఈ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఈ అవార్డును నరేంద్ర మోదీకి బహూకరించనున్నారు. ‘‘భారత్‌తో చరిత్రాత్మక, సమగ్ర, వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడటంలో నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. మోదీ కృషి ఫలితంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాటుపడిన మోదీకి జాయేద్‌ అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’’ని యువరాజు షేక్‌ మహమ్మద్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు