రేప్ చేసేస్తానంటూ ఉబర్ డ్రైవర్ బెదిరింపు

7 Jul, 2016 14:13 IST|Sakshi
రేప్ చేసేస్తానంటూ ఉబర్ డ్రైవర్ బెదిరింపు

‘‘నోర్మూసుకో.. లేకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తా’’ అంటూ ఉబర్ క్యాబ్ ఎక్కిన ఓ యువతిని డ్రైవర్ బెదిరించాడు. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో జరిగింది. దాంతో ఆమె చిగురుటాకులా వణికిపోయింది. యాప్ ద్వారా ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్లొచ్చని అనుకుంటే.. ఈ రకమైన బెదిరింపులు రావడం చూసి హడలిపోయింది. దాంతో కదులుతున్న కారులోంచి కిందకు దూకేసింది. అయినా ఆగని డ్రైవర్, ఆమెను కారుతో తొక్కించేయాలని చూశాడు. దాంతో క్యాబ్ డ్రైవర్ సంతు పర్మాణిక్ (28)ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆమెతో పాటు మరో స్నేహితురాలు కలిసి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆమె స్నేహితురాలు మధ్యలోనే దిగిపోయింది. అప్పటివరకు బాగానే ఉన్న డ్రైవర్, ఆ తర్వాతి నుంచి ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. వేగంగా వెళ్తూ సందుల్లోంచి వెళ్లసాగాడు. అవి బాగా నిర్మానుష్యంగా ఉండటంతో.. మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలని ఆమె చెప్పింది. తొలుత సరేనన్నా, కాసేపటి తర్వాత మళ్లీ సందుల్లోకే పోయాడు. దీనిపై ఆమె దిగాల్సిన ప్రాంతం వచ్చేవరకు ఆమెతో వాదిస్తూనే ఉన్నాడు. కారు ఆపమని తాను అనగానే అతడు ఒక్కసారిగా మండిపడ్డాడని, మరొక్క మాట మాట్లాడితే కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. దాంతో భయపడిన తాను కిటికీ అద్దం కిందకు దించి, అరవడం మొదలుపెట్టానని, అయితే రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో ప్రయోజనం కనిపించలేదని చెప్పింది. కిందకు దూకేయడానికి ఆమె ప్రయత్నించింది. అది గమనించిన డ్రైవర్.. తన సీటును వెనక్కి జరిపి ఆమెను అడ్డుకుని, పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా ఆమె తలుపు తెరుచుకుని కిందకు దూకేసింది. దాంతో అతడు అరుస్తూ కారు కింద తొక్కేస్తానని బెదిరించాడు. కారు రివర్స్ చేసుకుంటూ మీదకు రావడంతో ఆమె ఫుట్ పాత్ వద్దకు వెళ్లి బయటపడింది. తర్వాత ఆమె ఉబర్ సంస్థతో పాటు పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా