ఇతనికి అవేమి పట్టవు.. ఏకంగా 163 సార్లు

15 Jul, 2020 11:35 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: దేశవ్యా‍ప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి సొంత నగరాలకు వచ్చిన వారికి ప్రభుత్వం 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. కొంత మంది క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లఘిస్తూ యాథేచ్చగా బయట తిరుగుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.రాష్ట్రానికి చెందిన సహబ్ సింగ్ అనే వ్యక్తి జూన్ ‌29ను ముంబైలోని కోటేశ్వరా ప్రాంతం నుంచి ఉడిపికి వచ్చారు. అదే విధంగా తనకు హోం క్వారంటైన్‌ విధించాని అధికారులను కోరారు. దీంతో అధికారులు సహబ్‌ సింగ్‌ను జూలై 3 వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. (భారత్‌: 24 వేలు దాటిన కరోనా మరణాలు)

అయితే అధికారుల నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా సహబ్‌ సింగ్‌ ఉడిపితో పాటు కుందపూర్, పలు హోటళ్లను సందర్శించారు. 14 రోజుల హోం క్వారంటైన్‌ కాలంలో సుమారు 163 సార్లు అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి పలు ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. సహిబ్‌ సింగ్‌ మోబైల్‌కి ఏర్పాటు చేసిన జీపీఎస్‌ ట్రాకర్‌ సాయంతో ఈ వ్యవహారం బయటపడింది. అధికారులు విధించిన క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లఘించిన అతనిపై కుందపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా బెంగుళూరులో మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ జూలై 22 వరకు కొనసానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 44077 కేసులు నమోదు కాగా, 17390 మంది కోలుకున్నారు. 842 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో​ 25845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. (ఆక్సిజన్‌ 90 % కంటే తక్కువ ఉంటే ఆలోచించాలి )

మరిన్ని వార్తలు