జెడ్డాలో ఉగాది సంబరాలు

21 Mar, 2015 16:45 IST|Sakshi
జెడ్డాలో ఉగాది సంబరాలు

జెడ్డా:  సౌదీ అరేబియాలోని జెడ్డా,  పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీ కుటుంబాలు  తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా అధ్వర్యంలో  ఉగాది  పండుగ  సంబరాలు  ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా ఒక  కొత్త ఒరవడికి  శ్రీకారం చుట్టారు.  మన్మథ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తమ  చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడానికి  నిర్ణయించిందీ సంస్థ.    ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ముస్లిం కుటుంబ పెద్దలకు, వారి చిన్నారులకు ఇస్లామిక్ క్విజ్ మరియు ఖురాన్ గ్రంధ పోటీలను కూడ ఉగాది సందర్భంగా తాజ్ నిర్వహించింది.


    తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా) అధ్వర్యంలో సిలికానాంధ్ర మనబడి సహాయంతో  తెలుగు బోధన కార్యక్రమాలకు ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా తాము తాజ్ అధ్వర్యంలో తెలుగు బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికి ఉగాది నుండి దానికి పదును పెట్టడానికి సిలీకానంధ్ర మనబడితో కలిసామని తాజ్ ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ చెప్పారు.  ఈ సందర్భంగా సీలికానాంధ్ర మనబడి అంతర్జాతీయ విభాగానికి చెందిన శరత్ వేట అమెరికా నుండి ఫోన్ ద్వార సమావేశంలో పాల్గోన్న వారిను ఉద్దెశిస్తూ తెలుగు భాష అవశ్యకత గూర్చి నొక్కిచెప్పారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల ఆర్ధిక పరిస్ధితి మరియు ఇక్కడి పాఠశాలలో తెలుగు భాష అందుబాటులో ఉన్నందున మనబడి ఫీజు ఎడారి దేశాలలో తగ్గించాలని విజ్ఞప్తి చేసారు.


    తాజ్ అధ్యక్షుడు శేఖ్ మస్తాన్ మరియు ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ మాట్లాడుతూ  కుల,మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తమ సంఘం కేవలం తెలుగు ప్రవాసీయుల కొరకు పని చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా  క్విజ్ లో  గెలుపొందిన వారికి  తాజ్  ప్రతినిధులు విజయలక్ష్మి, శారదాంబ, మీనాక్షి, సాగర్, మస్తాన్ , యూసుఫ్ లు బహమతులు ప్రధానం చేసారు. ప్రతిభ కనబర్చిన  చిన్నారులను  తాజ్ మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి ప్రశంసించారు.

మరిన్ని వార్తలు