సంస్కరణలకు భారత్‌ మద్దతు

2 Oct, 2018 03:36 IST|Sakshi
ఢిల్లీలో ప్రసంగిస్తున్న గ్యుటెరస్‌

ఇండియా లేకుండా భిన్నధ్రువ ప్రపంచం అసాధ్యం

భారత్‌లో ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌ పర్యటన

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గ్యుటెరస్‌కు ఐరాస సీనియర్‌ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో ఆయన భేటీ అవుతారు. భారత పర్యటన సందర్భంగా గ్యుటెరస్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రపంచం మునుపెన్నడూ చూడని సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాసను తీర్చిదిద్దాలి. నా సిఫార్సులకు ఐరాసలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారత్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం భారత్‌ ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా భిన్నధ్రువ ప్రపంచాన్ని నిర్మించడం అసాధ్యం. ఇండియా ప్రపంచ శక్తిగా మారుతోంది’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు