ముంబైలో భూగర్భ రింగ్‌రోడ్డు నిర్మాణం

15 Dec, 2014 08:39 IST|Sakshi

ముంబై: ప్రతిపాదిత అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారికి కలిసేటట్లు నగరంలో భూగర్భ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు. దీన్ని రూ.90 వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు. అలాగే సూరత్-ముంబై ఎలివేటెడ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే తగిన కార్యాచరణ చేపట్టామని, అయితే ఇప్పటివరకు ఎటివంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

 

అయితే అదేసమయంలో అహ్మదాబాద్-ముంబై హైవేకు టన్నెల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామన్నారు. కాగా, తాను హాలెండ్ పర్యటనలో ఉన్నప్పుడు టన్నెల్ రోడ్ ఆలోచన వచ్చిందని వివరించారు. టన్నెల్ రోడ్డు ఒక సెక్షన్ మహీమ్ క్రీక్ వద్ద ప్రారంభమై బాంద్రా-వర్లి సీలింక్, నారిమన్ పాయింట్‌లను కలుపుతూ వెళుతుందన్నారు. అలాగే మరో సెక్షన్ పనులు సెవ్రే వద్ద ప్రారంభమై సముద్రం కింద నుంచి జేఎన్‌పీటీ, ముంబై పోర్టులను కలుపుతుందని వివరించారు. 

మరిన్ని వార్తలు