కాంగ్రెస్ కు రాజ్యాంగంపై పాఠాలు చెబుతాను: స్వామి

13 May, 2016 14:38 IST|Sakshi
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టడుతానని చెప్పడంపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఘాటుగా స్పందించారు. ఆపార్టీకి రాజ్యాంగంపై పాఠాలు చెబుతాననిక విమర్శించారు. అగస్టా వెస్ట్ లాండ్ కు సంబందించి తాను సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు నిజమైనవేనని స్పష్టం చేశారు.  ఈ ఒప్పందమే బోగస్ అని ఆయన ఆరోపించారు. అతి పెద్ద రాజకీయ పార్టీ తన పరువును పూర్తిగా కోల్పోయిందని ఎద్దేవా చేశారు.
 
నేషనల్ హెరాల్డ్ ,అగస్టా కేసుల్లో కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టినందుకే ఆపార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని  ఆరోపించారు. ఎప్పుడు తీర్మానం పెట్టినా తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నానని తెలిపారు. ముందు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవి కావని ఆరోపించారని, ఇప్పడు అందులోని సమాచారం తప్పు అని ఆరోపిస్తున్నారని తెలిపారు. వారికి రాజ్యాంగ నిబందనలపై పాఠాలు చెబుతానని స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి కి సమాచారం అందిచిన వెబ్ సైట్ లపై పరువు నష్టం దావా వేస్తామని,  వాటికి  సంఘ్ పరివార్  సంస్థలతో సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
 
 
 
 
 
>
మరిన్ని వార్తలు