భారీగా పెరగనున్న చమురు ధరలు

5 Jul, 2019 19:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌​ సామాన్యుడి చమురు వదిలించే పనిలో పడింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి. తాజా బడ్జెట్‌లో వెల్లడించిన దాని ప్రకారం సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1తో పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. తాజా సుంకాలకు వ్యాట్‌ను అదనంగా జోడించినప్పుడు పెట్రోల్‌ రూ.2.5, డీజిల్‌ రూ.2.3 మేర పెరిగే అవకాశం ఉంది. ఈ సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.28 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది.

శుక్రవారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70.51గా ఉండగా, డీజిల్‌ ధర రూ.64.33గా ఉంది. ముంబైలో పెట్రోల​ధర రూ.76.15 కాగా డీజిల్‌ ధర 67.40గా ఉంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు గురించి ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం పొందకముందే ఆయిల్‌ కంపెనీలు చమురు ధరలు పెంచేశాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా చోట్ల పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తూ.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు