ఆసక్తికరంగా సాగుతున్న నిర్మల ప్రసంగం.. 

1 Feb, 2020 11:55 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ఆమె ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన ప్రసంగం ప్రారంభంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్‌ జైట్లీని నిర్మల గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి​ చేశారని తెలిపారు. జీఎస్టీని తీసుకురావడం చారిత్రత్మకమైన నిర్ణయమని పేర్కొన్న నిర్మల.. శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు. న్యూ ఇండియా, సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్)

(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్హైలైట్స్కోసం ఇక్కడ క్లిక్చేయండి)

ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సాగుతున్న నిర్మల ప్రసంగం.. ఆకట్టుకునేలా ఉంది. మధ్యలో ఆమె ఓ కవితను కూడా చదివి వినిపించారు. 

నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది
మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం
నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం
మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోటలాంటిది
అని పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. గతంలో మాదిరిగానే నిర్మల ఈసారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్‌ ప్రతులును తీసుకునివచ్చారు. నిర్మల బడ్జెట్‌ ప్రసంగం వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి, ఇతర కుటుంబభ్యులు పార్లమెంట్‌కు వచ్చారు. (జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు)

మరిన్ని వార్తలు