షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో.. మధ్యలో ముగించిన బడ్జెట్‌ ప్రసంగం

1 Feb, 2020 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విత్తమంత్రి ప్రసంగం ఆద్యంతం అధికారపక్ష సభ్యుల కరతాళధ్వనుల మధ్య సాగింది. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి ముగించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 160 నిమిషాలకుపైగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు బడ్జెట్‌ ప్రసంగం కావడం విశేషం. గతంలో ఆమె 2017-18 తొలి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. దీంతో తన రికార్డును తానే స్వయంగా అధిగమించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ఓం​ బిర్లా ప్రకటించారు. (బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

>
మరిన్ని వార్తలు