ఇది వ్యూహాత్మక బడ్జెట్‌ : రాజ్‌నాథ్‌ సింగ్‌

1 Feb, 2020 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ 2020-21పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు. ఇది వ్యూహాత్మక బడ్జెట్‌ అని కొనియాడారు. ప్రజల అంచనాలను నిజం చేస్తూ.. జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి, ప్రాధాన్యతాంశాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మన దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక ఏడాది వరకల్లా మనం చేరాలనుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌ నిర్దేశించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
(చదవండి : బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలకు 2020-21 బడ్జెట్‌లో వ్యూహాత్మకంగా కేటాయింపులు చేశారని అన్నారు. నూతన టెక్సాలజీ ఆధారిత ఆర్థికవ్యవస్థలో కేంద్రం పాలసీ ఆహ్వానించదగిందని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు నవీన భారత నిర్మాణానికి బలాన్నిస్తాయని చెప్పారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ వృద్ధిని పునరుద్ధరించడం, డిమాండ్‌ పెరగడానికి ఊతమివ్వడం వంటి చర్యలు చేపట్టారని అన్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
(చదవండి : కార్పొరేట్‌ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట!)

మరిన్ని వార్తలు