కాలం చెల్లిన105 చట్టాల రద్దుకు ఓకే

19 Jan, 2017 03:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలం చెల్లిన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ చట్టాల రద్దు కోసం ‘రద్దు–సవరణ బిల్లు–2017’ను తీసుకురావాలన్న న్యాయ శాఖ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. ప్రధాని కార్యాలయం, లా కమిషన్, శాసన విభాగాలు ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చిందని న్యాయమంత్రి రవిశంకర్‌ మీడియాతో చెప్పారు. 139 చట్టాల రద్దుకు వివిధ మంత్రిత్వ శాఖలు ఒప్పుకోలేదు.

యూఏఈతో ఒప్పందానికి ఓకే
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి రూ. 200.78 కోట్లు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. తూర్పు భారతంలో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో రోడ్డు రవాణా, రహదారుల రంగంలో సహకారం కోసం  ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు