హజ్‌ యాత్రికులకు కేంద్రం షాక్‌

16 Jan, 2018 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హజ్‌ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్‌ ఇచ్చింది. హజ్‌ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది.

ఇప్పటివరకూ హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ప్రతి ఏటా రూ. 700 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. హజ్‌ యాత్రకు సబ్సిడీ నిలుపుదల వల్ల మిగిలే డబ్బును మైనార్టీ బాలికలు, మహిళల సంక్షేమానికి వినియోగిస్తామని నక్వీ పేర్కొన్నారు. హజ్‌ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అన్నారు. 


 

మరిన్ని వార్తలు