ఎన్‌పీఆర్‌: కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వివరణ

24 Dec, 2019 16:11 IST|Sakshi

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌  మీడియా  సమావేశం

2020 ఏప్రిల్,  సెప్టెంబర్ మధ్య ఎన్‌పిఆర్ ప్రక్రియ

ఎన్‌పీఆర్‌కోసం రూ. 3941 కోట్లు

సెన్సస్‌ కోసం రూ. 8754 కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ:   కేంద్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదించిన ఎన్‌పీఆర్‌ ఆమోదం, తదితర  అంశాలపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌  మీడియా సమావేశం నిర్వహించారు.  జనాభా  నమోదు  కార్రయక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. 2010లోనే దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. పీయూష్‌ గోయల్‌ తదితర మంత్రివర్గ సహచరులు పాల్గొన్న  ఈ సమావేశంలో  రూ. వేల కోట్ల అటల్‌ భూజల్‌  యోజనకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. అలాగే ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్టు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు- ముఖ్యాంశాలు :

  • 2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణన వుంటుంది.  ఇందుకోసం స్పెషల్‌ మొబైల్‌ ఆప్‌ తీసుకొస్తాం.  ప్రజలు ఈ యాప్‌ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుంది. అంతేకానీ, దీనికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయో మెట్రిక్‌ వివరాల నమోదు వుండదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారు.  తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుంది.
  • టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు.  హిమాలయా, నార్త్‌ఈస్ట్‌, కృష్ట, కోస్టల్‌, ఇకో, డిజర్ట్‌,  తీర్థాంకర్‌, రామాయణ తదితర 16 సర్క్యూట్స్‌ ద్వారా  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. 
  • ఒక వ్యక్తి రెండు ఆయుధాలకు లైసెన్స్‌ కలిగి వుండేందుకు అనుమతి. గతంలో మూడువుండగా, తర్వాత ఒక ఆయుధానికి పరిమితం చేసినా, తాజా  నిర్ణయంలో రెండు ఆయుధాలకు అనుమతి.
  • చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడే అధికారి ఫోర్ స్టార్ జనరల్ , సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా ఉంటారు.
  • రైల్వే బోర్డు పునర్నిర్మాణం చారిత్రాత్మక నిర్ణయం. ఈప్రక్రియ కొనసాగుతోంది- మంత్రి పియూష్ గోయల్. మొత్తం 8 రైల్వే సేవలను  ఇండియన్‌  రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) కిందికి తీసుకురానుంది. దీనికి  కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
మరిన్ని వార్తలు