జేఎన్‌యూలో వామపక్షాల విజయభేరి

16 Sep, 2018 15:03 IST|Sakshi

నాలుగు కీలక పదవులను సొంతం చేసుకున్న యునైటెడ్‌ లెఫ్ట్‌

జేఎన్‌యూలో ఏబీవీపీ పరాజయం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో యునైటెడ్‌ లెఫ్ట్‌ విజయం సాధించింది. జేఎన్‌యూ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్‌ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్‌ అహ్మద్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్‌ జాయింట్‌ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులను ఆ కూటమి సొంతం చేసుకుంది.

లెఫ్ట్‌ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్‌ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్‌ నమోదైంది. యునిటైడ్‌ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్‌ఇండియా స్టూడెంట్‌​ అసోషియేషన్‌ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌, ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌) ఉన్నాయి.

మరిన్ని వార్తలు