మహాత్ముడి స్ఫూర్తి ఇప్పుడే అవసరం

29 Feb, 2020 01:51 IST|Sakshi

ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌

ఐక్యరాజ్యసమితి: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు  నెలకొనాల్సిన పరిస్థతి ఏర్పడిన ప్రస్తుత తరుణంలోనే.. శాంతి, అహింస బోధించిన మహాత్మా గాంధీ స్ఫూర్తి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాజంలో అంతా కలిసిమెలసి జీవించేందుకు గతంలో కన్నా ఇప్పుడే  మహాత్ముడి స్ఫూర్తి అవసరం ఎంతో ఉందన్నారు. హింసను విడనాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘భారత్‌లో నెలకొన్న పరిస్థితిని ప్రధాన కార్యదర్శి నిశితంగా పరిశీలిస్తున్నారు. అల్లర్ల సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న మరణాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, సంయమనం పాటించాలని కోరుతున్నారు’ అని గ్యుటెరస్‌ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని వార్తలు