అడ్మిట్‌ కార్డ్‌ మీద స్టార్‌ హీరో ఫోటో..!

4 Sep, 2018 09:40 IST|Sakshi

అలహాబాద్‌ : విద్యార్థులకే కాక జంతువులకు అడ్మిట్‌ కార్డ్‌ ఇచ్చిన యూనివర్సిటీలు ఉన్న దేశం మనది. వాటికి పోటీగా మరో యూనివర్సిటీ వచ్చి చేరింది. అయితే ఈ యూనివర్సిటీ మాత్రం కాస్తా పద్దతిగా విద్యార్థి స్థానంలో జంతువుకు బదులు ఓ స్టార్‌ హీరో ఫోటోని ప్రింట్‌ చేసి ఇచ్చింది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ గొండా జిల్లాలో చోటు చేసుకుంది.

డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ యూనివర్సిటీ పరిధిలోని రవీంద్ర సింగ్‌ స్మారక్‌ మహావిద్యాలయ్‌ కాలేజిలో అమిత్‌ ద్వివేది అనే విద్యార్థి బీ ఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది పరీక్షల నిమిత్తం ఇచ్చిన అడ్మిట్‌ కార్డ్‌ మీద అమిత్‌ ఫోటోకు బదులుగా బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఫోటోని ప్రింట్‌ చేసి ఇచ్చారు. ఇది గమనించిన అమిత్‌ ఈ విషయాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అందుకు వారు పొరపాటున అలా జరిగి ఉంటుంది.. ఏం కాదు అంటూ పరీక్షలకు అనుమతిచ్చారని తెలిపాడు. అయితే అమితాబ్‌ బచ్చన్‌ ఫోటోతో ఉన్న అడ్మిట్‌ కార్డ్‌తో పరీక్షలు రాశాను.. ఇప్పుడు మార్క్స్‌ షీట్‌ మీద కూడా అమితాబ్‌ బచ్చన్‌ ఫోటో వస్తే నా పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నాడు అమిత్‌.

ఈ విషయం గురించి రవీంద్ర సింగ్‌ స్మారక్‌ మహావిద్యాలయ్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారిని ప్రశ్రించగా.. ‘అమిత్‌ ఇంటర్‌ నెట్‌ సెంటర్‌లో పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో తప్పిదం దొర్లడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. లేదా ఇది యూనివర్సిటీ తప్పిదం కూడా అవ్వొచ్చు. ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్ది, మార్క్స్‌ షీట్‌లో అమిత్‌ ఫోటో వచ్చేలా చేస్తాం’ అని తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పెట్రో మంటలతో మోదీ మెట్రో బాట’

ముగ్గురు పోలీసుల కిడ్నాప్‌.. ఆపై హత్య

గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

వామ్మో ! నల్లత్రాచు

లైవ్‌ ఎన్‌కౌంటర్‌.. మీడియాకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఐరన్‌ లేడి’గా వస్తున్న అమ్మ

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

మలేసియాలో మస్త్‌ మజా