ఇక పెళ్లికాని జంటలకు రూములిస్తారట

27 Aug, 2016 09:13 IST|Sakshi
ఇక పెళ్లికాని జంటలకు రూములిస్తారట

బెంగళూరు: ఇక పెళ్లికాని యువ జంటలకు కూడా రూములు అద్దెకు ఇస్తామని ఓయో సంస్థ ప్రకటించింది. రెండు నెలల కింద ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఇక దానిని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో 70 వేల గదులను అద్దెకు ఇస్తున్న ఈ సంస్థ వాటిల్లో 60శాతం గదులను పెళ్లికానీ యువజంటలకు కేటాయిస్తున్నట్లు తెలిపింది.

ఇందుకోసం ప్రత్యేక సైట్, యాప్ ద్వారా కూడా వాటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రూమ్ కావాలని వచ్చిన వారు తమ స్థానికతకు సంబంధించిన దస్తావేజులు చూపించిన వెంటనే వారికి ఈ సౌకర్యం ఓయో కల్పించనుంది. అంతేకాకుండా.. కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ ను మెట్రో నగరాలతోపాటు ప్రముఖమైన 100 పట్టణాల్లో ప్రారంభించింది. ఓయో రూమ్స్ను ఓ జపాన్ టెలికం సంస్థ, ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ సహాయంతో ప్రారంభించారు.

మరిన్ని వార్తలు