ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

29 Jul, 2019 10:57 IST|Sakshi

ట్రక్కు అతివేగమే ప్రమాదానికి కారణం: డీజీపీ ఓపీ సింగ్‌

లక్నో: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని కుట్రపూరితంగా చేశారని ఆయన ఆరోపించారు. ఆమెను చంపేందుకు కావాలనే ట్రక్కుతో ఢీకొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన యూపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. అయితే వీటన్నింటికి సమాధానం ఇస్తూ.. రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రక్కు అతివేగం కారణంగానే ఈ  ప్రమాదం చోటుచేసుకుందని, దీనిలో ఎలాంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్రక్కు డ్రైవర్‌, యజమానిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. అయితే బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు పట్టుబడితే.. దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాధితురాలితో పాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు.

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జనారణ్యంలో కారుణ్యమూర్తి

జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు

కశ్మీర్‌పై అత్యవసర భేటీకి షా పిలుపు

ఇక మగాళ్లూ పుట్టరు

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

14 మంది రెబెల్స్‌పై కొరడా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

మేఘాలయ అసెంబ్లీ స్పీకర్‌ కన్నుమూత

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

ఈనాటి ముఖ్యాంశాలు

జనావాసాల్లోకి వచ్చిన మొసలి..

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్​

చంద్రయాన్‌ 2 : ఇది స్వదేశీ విజయం

దంతెవాడలో హోరాహోరీ కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు

నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్‌

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

‘నీట్‌’ పరీక్షకు రూ.లక్ష రుణం

కమల ప్రక్షాళన

నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

కశ్మీర్‌కు పదివేల బలగాలు

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై