కరెంటు ఉంటే..కిరోసిన్ కట్!

13 Jan, 2015 03:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై కిరోసిన్ పొందుతున్నవారిపై దృష్టి పెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విద్యుత్ సదుపాయం ఉన్న గృహాలను గుర్తించి.. ఆ  ఇళ్లకు సబ్సిడీ కిరోసిన్ సదుపాయాన్ని నిలిపేయాలనే ప్రతిపాదన తమకు వచ్చిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్లో ధరను సమయం వచ్చినప్పుడు తగ్గిస్తామని ప్రధాన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 30,575 కోట్లను, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ. 46,458 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.నగదు బదిలీ వల్ల ఎల్పీజీ సబ్సీడీ భారాన్ని 15శాతం  తగ్గించుకుంది.
 

మరిన్ని వార్తలు