ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన..

20 Sep, 2016 21:03 IST|Sakshi
ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన..

లక్నోః ఉత్తరప్రదేశ్ లో మొదటిసారి ప్రారంభించిన పోలీస్ ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన లభించినట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలతో మమేకమై.. ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రారంభించిన మైక్రోబ్లాగింగ్ వేదికను దేశంలోనే మొట్ట మొదటిసారి తమ రాష్ట్రం ప్రారంభించినట్లు చెప్పారు.

ట్విట్టర్ సర్వీస్ ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 19 తేదీల మధ్య  అతి తక్కువ వ్యవధిలోనే 1,710 ట్వీట్లు వచ్చాయని, వాటిలో 1,280 కేసులను ఇప్పటికే పరిష్కరించినట్లు రాష్ట్ర డీజీపీ జావేద్ అహ్మద్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ ట్విట్టర్ లో సేవ‌లందించేందుకు సెప్టెంబర్ 8న ముందుకు వ‌చ్చింది. ప్రజలు ఆన్లైన్ లో ఇచ్చే ఫిర్యాదులకు డిపార్ట్ మెంట్ వెంటనే స్పందింస్తుందని, ఇందుకోసం ట్విట్లర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర డీజీపీ  పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు