మహిళా పోలీసు అధికారి అరుదైన ఘనత

27 Jan, 2016 12:15 IST|Sakshi
మహిళా పోలీసు అధికారి అరుదైన ఘనత

లక్నో:  ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళా  ఉన్నతాధికారి అరుదైన ఘనతను సాధించారు. ఐపిఎస్ కేడరుకు చెందిన అపర్ణ కుమార్ అంటార్కిటికా  ఉపఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాన్ని అధిరోహించి  రికార్డ్ సృష్టించారు. 17,000 అడుగుల ఎత్తున ఉన్న  మౌంట్ విన్సన్ మాసిఫ్  శిఖరానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.  తన సహచరులతో కలిసి జనవరి 17 న అపర్ణ  ఈ ఫీట్ సాధించి,  మౌంట్ విన్సన్ మాసిఫ్ శిఖరం అగ్రభాగాన భారత త్రివర్ణ పతాకం సహా, రాష్ట్ర పోలీసు జెండాను  ఎగురవేశారు.  

దీంతో ఈ ఘనతను సాధించిన దేశంలోని మొట్టమొదటి ఐసిఎస్ ఆఫీసర్ గా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.  ఇప్పటివరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదని పలువురు ప్రముఖులు,  ఐపిఎస్ అధికారులు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు.  భవిష్యత్తుల్లో మరిన్ని సాహసాలకు నాంది పలకాలని అభిలషించారు. ఇటు ఈ  అరుదైన ఈ కీర్తిని గడించినందుకు  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా  అపర్ణ కుమార్ను అభినందించారు.

 గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా పోలీసు ఉన్నతాధికారి(ఎఎస్పీ) రాధిక ఏడు వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న మౌంట్‌కన్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ  రికార్డును అపర్ణ అధిగమించారు.

 

మరిన్ని వార్తలు