737 మాక్స్‌ విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ 

16 Mar, 2019 02:53 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్‌ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్‌ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్‌ స్టాల్‌ ప్రివెన్షన్‌ వ్యవస్థను పది రోజుల్లోగా అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో స్టాల్‌ ప్రివెన్షన్‌ వ్యవస్థ విఫలం కావడంతో లయన్‌ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 మాక్స్‌8 విమానం కూలిపోయిందనీ, ఈ దుర్ఘటనలో 189 మంది చనిపోయారని వెల్లడించారు. ఒక్కో బోయింగ్‌ మాక్స్‌ విమానంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.14 కోట్లు(2 మిలియన్‌ డాలర్లు) కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 371 బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు సేవలు అందిస్తున్నాయనీ, వీటి అప్‌గ్రేడ్‌కు బిలియన్‌ డాలర్లు(రూ.6,895 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు.   

మరిన్ని వార్తలు