లోక్‌సభలో ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై దుమారం

25 Jul, 2019 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్‌ లోక్‌సభలో గురువారం సబాధ్యక్ష స్ధానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆజం ఖాన్‌ క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఖాన్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మంత్రులు కోరారు.

మరోవైపు సభాద్యక్ష స్ధానంలోకి తిరిగివచ్చిన స్పీకర్‌ ఓం బిర్లా ఆజం ఖాన్‌ను మందలించి క్షమాపణ చెప్పాలని సూచించారు. ఎంపీలు సైతం ఆజం ఖాన్‌ క్షమాపణలు కోరడంతో అఖిలేష్‌ యాదవ్‌ తమ ఎంపీని సమర్ధిస్తూ పార్లమెంట్‌లో బీజేపీ సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని ఆరోపించారు. ఇక క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజం ఖాన్‌ తాను అన్‌పార్లమెంటరీ పదాలు ఏమైనా వాడితే రాజీనామా చేసేందుకు సిద్ధమనిచెప్పారు. ఆజం ఖాన్‌, అఖిలేష్‌ యాదవ్‌లు ఇద్దరూ ఆ తర్వాత లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు