‘యోగీ నాతో నిర్మొహమాటంగా చెప్పారు’

19 Mar, 2017 15:46 IST|Sakshi
‘యోగీ నాతో నిర్మొహమాటంగా చెప్పారు’

న్యూఢిల్లీ: తనకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కావాలని ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తనతో చాలా నిర్మొహమాటంగా చెప్పేశారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ చాలా పెద్ద రాష్ట్ర మైనందున తన తర్వాత స్థానంలో ఇద్దరు ఉండి బాధ్యతలు పంచుకుంటే తనకు పరిపాలన కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన చెప్పారని తెలిపారు. ‘వారు ముగ్గురు ముగ్గురే. వాళ్లది చాలా గొప్ప సమన్వయం​’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను, దినేశ్‌ శర్మను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురి పేర్లను శనివారమే ప్రకటించారు. యోగీ మంచి నిజాయితీ పరుడని, ఆయనను వేలెత్తి చూపించే అవకాశమే లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని ప్రతి క్షణం తపించే ఆయన కల నేడు సీఎంగా మారుతుండటంతో నెరవేరిందని చెప్పారు.

మరిన్ని వార్తలు