రాష్ట్రానికి పట్టణ సంస్కరణ ప్రోత్సాహకం

24 Jun, 2017 00:28 IST|Sakshi
రాష్ట్రానికి పట్టణ సంస్కరణ ప్రోత్సాహకం
తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణకు ఆరోస్థానం
 
సాక్షి, న్యూఢిల్లీ: 2016–17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సా హకాలు అందించింది. అమృత్‌ పథకంలో భాగంగా ఈ–గవర్నెన్స్, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్, తదితర అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు మార్కులు ఇవ్వగా తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలిచాయి. 16 రాష్ట్రాలకు మొత్తం రూ.500 కోట్లను పట్టణాభివృద్ధి శాఖ పంపిణీ చేసింది.

ఏపీకి రూ.27.14 కోట్లు, తెలంగాణకు రూ.19.93 కోట్లు అందజేసింది. శుక్రవారం ఢిల్లీలో పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా ఈ ప్రోత్సాహకాలు అందించారు. సిటీ లివెబులిటీ ఇండెక్స్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశంలోని 116 ప్రధాన నగరాల్లో జీవన నాణ్యతను ఈ ఇండెక్స్‌ ద్వారా వెల్లడిస్తారు.
మరిన్ని వార్తలు