కరోనా ఎఫెక్ట్‌..అమెరికా కాన్సులేట్‌ కీలక నిర్ణయం

14 Mar, 2020 11:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా కాన్సులేట్‌ కీలయ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇమ్మిగ్రెంట్‌, నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. వీసా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ చేసుకోవాలని సూచించింది. భారత్‌లోని అన్ని అమెరికన్‌ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా, కరోనా వ్యాప్తిని దృష్ట్యా అమెరికాలో శుక్రవారం ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధించిన సంగతి తెలిసిందే. 
(చదవండి : కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ)

కరోనా ప్రపంచ దేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. ఈ కోవిడ్‌–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. కరోనా ప్రకంపనలు భారత్‌లో కూడా విస్తరిస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్‌ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్‌ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు.
(చదవండి :భారత్‌లో రెండో మరణం)

మరిన్ని వార్తలు